ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం -భట్టి 1 y ago
TG: 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా.. పారదర్శకత జవాబుదారీతనంలో ప్రభుత్వం సాగుతోందని తెలిపారు. జోడు గుర్రాల సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని నమ్ముతున్నామన్నారు. ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని అన్నారు. హైదరాబాదు కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు మూసీ సుందరీకరణ, మెడికల్ కాలేజీల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించామన్నారు.